ఈవారం థియేటర్స్‌లో, ఓటీటీలో రాబోతున్న సినిమాలివే!
on Oct 13, 2025
ప్రేక్షకులకు సినిమా దాహాన్ని తీర్చేందుకు ఇప్పుడు థియేటర్లతోపాటు అనేకా ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యంగా ఓటీటీలలో నచ్చిన జోనర్‌లో నచ్చిన సినిమా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. థియేటర్లలో వచ్చే సినిమాల కోసమే కాదు, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవారం థియేటర్లలో, ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏమిటో చూద్దాం.
థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు:
మిత్రమండలి
ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎమ్ ప్రధాన పాత్రల్లో ‘మిత్రమండలి’ విడుదలవుతోంది. ఎస్.విజయేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈనెల 16న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.
తెలుసు కదా
సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా ప్రధాన తారాగణంగా నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘తెలుసు కదా’. ఈనెల 17న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది.
డ్యూడ్
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా రూపొందిన సినిమా ‘డ్యూడ్’. ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈనెల 17న తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
కె-ర్యాంప్
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన లవ్ ఎంటర్టఐనర్ కె ర్యాంప్. జేమ్స్ నాని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది.
ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు:
నెట్ ఫ్లిక్స్:
ఎవ్రిబడీ లవ్స్‌మి వెన్ ఐ యామ్ డెడ్.. అక్టోబర్ 14
ఇన్‌సైడ్ ఫ్యురియోజా.. అక్టోబర్ 15
ది డిప్లొమ్యాట్ సీజన్ 3.. అక్టోబర్ 16
రొమాంటిక్స్ ఎనోనిమస్.. అక్టోబర్ 16
గుడ్ న్యూస్.. అక్టోబర్ 17
షి వాక్స్ ఇన్ డార్క్‌నెస్.. అక్టోబర్ 17
టర్న్ ఆఫ్ ద టైడ్ సీజన్ 2.. అక్టోబర్ 17
ఉమెన్ ఇన్ క్యాబిన్.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్
స్విమ్ టు మీ
బూట్స్ సీజన్ 1
ది చూసేన్
నీరో
ది రిస్సరెక్టడ్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్
విక్టోరియా బెక్ హ్యామ్ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్
ట్రూ హంటింగ్ - ఇంగ్లీష్ / హిందీ డాక్యుమెంటరీ
అమెజాన్ ప్రైమ్ వీడియో:
పరమ్ సుందరి
ది మలబార్ టేల్స్ (కన్నడ మూవీ)
రిప్పాన్ స్వామి (కన్నడ మూవీ)
మెయింటెనెన్స్ రిక్వైర్డ్ (ఇంగ్లీష్ / తెలుగు మూవీ)
ది థికెట్ (ఇంగ్లీష్ మూవీ)
టు డై అలోన్ ( ఇంగ్లీష్ మూవీ)
వెడ్డింగ్ ఇంపాజిబుల్: సీజన్ 1 వెబ్ సిరీస్
ఆహా :
ఆనందలహరి.. వెబ్ సిరీస్ (అక్టోబర్ 17)
జీ 5:
కిష్కింధపురి - అక్టోబర్ 17
భగవత్ చాప్టర్ 1 రాక్షస్.. వెబ్ సిరీస్ అక్టోబర్ 17
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



