సంక్రాంతికి వస్తున్నాం హిందీలో రీమేక్! ఆ స్టార్ హీరో ఓకేనా!
on Oct 13, 2025

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'(sankrantik vastunnam).ఘన విజయాన్ని అందుకోవడమే కాదు 300 కోట్లరూపాయల గ్రాస్ కి పైగా వసూలు చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసింది. వరుస ప్లాప్ లని ఎదుర్కుంటున్న విక్టరీ వెంకటేష్(venkatesh),దిల్ రాజు(Dil Raju) కెరీర్ కి మంచి బూస్టప్ ని కూడా ఇచ్చింది.
ఇప్పుడు ఈ మూవీని దిల్ రాజు హిందీలో రీమేక్ చెయ్యబోతున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సదరు రీమేక్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) హీరోగా చేయనునట్టుగా కూడా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. అక్షయ్ కుమార్ ఇప్పటి వరకు వేరే భాషా చిత్రాల రీమేక్ లో చెయ్యడమే కాకుండా విజయాన్ని అందుకున్నాడు. మరి సంక్రాంతికి వస్తున్నాం హిందీలో రీమేక్ అయ్యి అక్షయ్ కుమార్ చేయడం ఖాయమైతే కనుక, వరుస ప్లాప్ ల్లో ఉన్న అక్షయ్ కుమార్ కి విజయం లభించే అవకాశాలు ఎక్కువే ఉంటాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతుంది. హిందీ ప్రేక్షకులు కూడా ఫ్యామిలీ అండ్ కామెడీ కంటెంట్ తో కూడిన సబ్జెక్ట్ ని సూపర్ హిట్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



