కాంతార చాప్టర్ 1 తెలుగు కలెక్షన్స్ ఇంతే.. ఏమైనా తెలుగోడు గొప్పోడు
on Oct 13, 2025

విజయదశమి(Vijaydasami)కానుకగా అక్టోబర్ 2 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన 'కాంతార చాప్టర్ 1'(Kantara Chapter 1)సిల్వర్ స్క్రీన్ వద్ద తన విజయ పరంపరని కొనసాగిస్తూనే ఉంది. పాన్ ఇండియా వ్యాప్తంగా ఎవరి ఊహలకి అందని విధంగా రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తూ మేకర్స్ కి సరికొత్త సవాలు విసురుతుంది. రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా 700 కోట్ల రూపాయిల మార్క్ ని చేరుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇప్పటి వరకు తెలుగులో ఎంత మేర కలెక్షన్స్ ని వసూలు చేసిందనే ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది.
తెలుగు ప్రేక్షకులు కూడా రిలీజ్ రోజు నుంచే కాంతార చాప్టర్ 1 కి బ్రహ్మరధం పట్టారు. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చినట్టుగా మేకర్స్ తీర్చిదిద్దడంతో చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా అన్ని వయసుల వారు థియేటర్స్ కి పోటెత్తారు. ఈ క్రమంలో తెలుగులో ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయిల కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. కన్నడ హీరో రెండు వారాలకే ఈ మేర కలెక్షన్స్ ని సాధించడం ఒక రికార్డుగా చెప్పవచ్చు .గతంలో రజనీకాంత్, యష్ వంటి హీరోలు మాత్రమే తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారు. ఇప్పుడు ఈ ఫీట్ సాధించిన మూడో తెలుగుయేతర హీరోగా రిషబ్ శెట్టి నిలిచాడు.
రెండు వారాలు అవుతున్నా తెలుగు నాట ఇప్పటికి మంచి వసూళ్లనే రాబడుతుంది. వీకెండ్ లో అయితే అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. పైగా మరికొన్ని రోజుల్లో దీపావళి రానుంది. కొన్ని తెలుగు సినిమాలు వీకెండ్ లో ఉన్నా, అవి పెద్ద సినిమాలు కావు. వాటికి టాక్ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్ కి వెళ్తారు. ఆల్రెడీ కాంతార మూడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండటంతో తెలుగులో మరిన్ని కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉంది. ఇక తమిళ, మలయాళ వెర్షన్స్ కలిపి ఇప్పటి వరకు 50 కోట్లని రాబట్టింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



