Home

»

Latest News

నివేదా థామస్ తమ్ముడు హీరోగా 'బెంగుళూరు మహానగరంలో బాలక'

May 25, 2026 4:39PM

మంత్ర మూవీ మేకర్స్, ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్  సంయుక్తంగా, మహి - రాజ్ ద్వయం దర్శకత్వంలో 'బెంగళూరు మహానగరంలో బాలక' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. (Bengaluru Mahanagaram Lo Balaka)

ఇటీవలే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ నటుడు ప్రియదర్శి విడుదల చేశారు.

తెలుగు కుర్రాడు బెంగళూరులో ఎదుర్కొనే కష్టాల నేపథ్యంతో వినోదభరితమైన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.

నివేదా థామస్  తమ్ముడు నిఖిల్ థామస్ నటిస్తున్న ఈ చిత్రానికి మల్లూ నాయక్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. విశ్వదీప్ సంగీతాన్ని అందిస్తున్నారు, హర్షిత్ కొటా ఏడిటర్ గా చేస్తున్నారు.

ఈ చిత్రంలో రఘు కారుమంచి ప్రముఖ పాత్రలో నటిస్తుండగా, ఆయనతో పాటు చిత్రం శ్రీను కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే నటులు మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ధనరాజ్ వినీత్, మహేంద్ర, అచ్యుత్ కూడా ఈ చిత్రంలో  నటిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com