'అమ్మ' అధ్యక్షుడిగా మోహన్‌లాల్ ఎకగ్రీవం!
on Dec 10, 2021

మలయాళం సూపర్‌స్టార్ మోహనల్‌లాల్ మరోసారి అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ పదవికి మరే నటుడూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు ఎడవెల బాబు 'అమ్మ' ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి కొనసాగనున్నారు.
అలాగే కోశాధికారి పదవికి సిద్దిఖ్, జాయింట్ సెక్రటరీ పదవికి జయసూర్య మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారు కూడా ఆ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. వారి పదవీ కాలం 2024 వరకు కొనసాగనున్నది. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ పదవికి ఆశా శరత్, శ్వేతా మీనన్, మణ్యన్ పిళ్ల రాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఆ పదవితో పాటు మిగతా కార్యవర్గానికి సంబంధించిన డిసెంబర్ 19న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను కూడా అదే రోజు ప్రకటిస్తారు.
నటి భావనను దిలీప్ వేధించాడంటూ కేసు వెలుగులోకి వచ్చాక 'అమ్మ' ప్రతిష్ఠ దెబ్బతింది. దిలీప్‌ను సంఘం నుంచి బహిష్కరించడంతో పలువురు ఆఫీస్ బేరర్స్ తమ పదవులకు రాజీనామా చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



