Home

»

Latest News

‘ప్యారడైజ్’లో మోహన్ బాబు: ఈ జనరేషన్ డైరెక్టర్స్ ఓ లుక్ వేయాల్సిందే.!

Sep 25, 2026 12:54PM

‘ది ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు నటన, స్క్రీన్ ప్రజెన్స్ ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తున్నాయి. సినిమాలో ఆయన కనిపించే తీరు, డైలాగ్ డెలివరీ, పాత్రకు ఇచ్చిన ఇంపాక్ట్ గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

ముఖ్యంగా ఈ జనరేషన్ దర్శకులు మోహన్ బాబు టాలెంట్‌ను మరింతగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌లో మోహన్ బాబు నటిస్తే.. ఆ పాత్రలకు మరింత వెయిట్ వస్తుందని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల్లో బలమైన పాత్రలు, గుర్తుండిపోయే క్యారెక్టర్స్ కోసం మోహన్ బాబును తీసుకుంటే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. 

ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడు వచ్చే ఇంపాక్ట్‌ను దర్శకులు ఉపయోగించుకుంటే క్యారెక్టర్స్ మరింత ఎలివేట్ అవుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పిరిట్ పరిస్థితి ఏంటి.?

ఇప్పటికే హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసిన మోహన్ బాబు.. ఇప్పుడు ‘ప్యారడైజ్’తో మరోసారి తన పెర్ఫార్మెన్స్ ఏంటో చూపించారనే టాక్ వస్తోంది.

మరి ఈ స్పందన తర్వాతైనా కొత్త తరం దర్శకులు మోహన్ బాబుకు మరిన్ని పవర్‌ఫుల్ రోల్స్ రాస్తారా? పాన్ ఇండియా సినిమాల్లో ఆయనకు ఎలాంటి పాత్రలు వస్తాయో చూడాలి.

 

 

 

[Mohan Babu Acting, Mohan Babu Paradise, Mohan Babu Movies, The Paradise Movie, Nani, Srikanth Odela, Kayadu Lohar, Telugu Film News, Telugu News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com