
పాన్ ఇండియా రెబల్ స్టార్ ఫ్యాన్స్ స్టిల్ ఈ నిమిషం వర్క్ లో ఉన్నా కూడా వాళ్ళ మనసు మొత్తం 'ఫౌజీ' పైనే ఉంటుంది. ఎందుకంటే సెల్యులాయిడ్ పై ప్రభాస్ దర్శనమిచ్చే మూవీ 'ఫౌజీ' నే. ఈ క్రమంలో వాళ్లందరికీ గుడ్ న్యూస్ చెప్పేలా 'ఫౌజీ' కి సంబంధించిన తాజా న్యూస్ జోష్ సోషల్ మీడియాలో షికారు చేస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లీక్స్ ప్రకారం, అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘వర్ల్డ్ ఆఫ్ ఫౌజీ’ పేరుతో ఒక పవర్ ఫుల్ కాన్సెప్ట్ టీజర్‌ను ఆవిష్కరించేందుకు చిత్రబృందం సమాయత్తమవుతోంది. ఈ ప్రత్యేక టీజర్ ద్వారా సినిమాలోని విజువల్స్, 1940ల కాలం నాటి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ బ్యాక్‌డ్రాప్, ప్రభాస్ క్యారక్టర్ స్వభావాన్ని ప్రపంచానికి పరిచయం చేయనున్నారని టాక్.
ఇది కూడా చదవండి: కథ మారిందా: మార్చింది ఎవరు!..వైరల్ గా మారిన రూమర్

ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో భారీ యాక్షన్ షెడ్యూల్ ని చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత సుమారు 10 రోజుల పాటు టాకీ పార్ట్ చిత్రీకరణ జరగనుంది. అంతేకాకుండా, అభిమానులను ఉర్రూతలూగించేలా ప్రభాస్‌పై ఒక మాస్ మోంటాజ్ సాంగ్‌ను కూడా ఇదే షెడ్యూల్‌లో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. విజువల్ క్వాలిటీ కోసం అంతర్జాతీయ ఫైట్ మాస్టర్ల ఆధ్వర్యంలో కొన్ని కీలక ఫైట్ సీన్లను రీషూట్ చేస్తూ నవంబర్ చివరినాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి చేయాలనే పట్టుదలతో యూనిట్ ఉంది. ప్రభాస్ సరసన ఇంటర్నెట్ సెన్సేషన్ ఇమాన్వి కథానాయకగా నటిస్తుండగా, బాలీవుడ్ దిగ్గజాలు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మొదట 2026 డిసెంబర్ 3న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ మేకింగ్ లో క్వాలిటీ కోసం కొత్త తేదీపై నిర్ణయం తీసుకోనున్నారు. పాన్ ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా హను రాఘవపూడి దర్శకుడు.
[Fauzi Teaser Release Date, Prabhas, Hanu Raghavapudi,Mythri Movie Makers, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





