Home

»

Latest News

కథ మారిందా: మార్చింది ఎవరు!..వైరల్ గా మారిన రూమర్ 

Sep 25, 2026 11:47AM

 

 ప్యారడైజ్ థియేటర్స్ లో సందడి చేస్తూ ఉంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 88 కోట్ల గ్రాస్ ని రాబట్టిందంటే నాని కట్ అవుట్ కి ఉన్న శక్తీ ఏ పాటిదో తెలుసుకోవచ్చు. కానీ  కథ, కథనంలో బలం లేకపోవడంతో  నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ కథ విషయంలోనే ఫిలిం సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి 

ప్రెజెంట్  థియేటర్లలో చూస్తున్న కథ వేరు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మొదట అనుకున్న ఒరిజినల్ ప్లాట్ లైన్ వేరు అనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఫిల్మ్ నగర్ నుంచి వస్తున్న తాజా రూమర్స్ ప్రకారం.. ప్రమోషన్లలో చెప్పినట్లుగా లేదా ప్రేక్షకులు ముందుగా ఊహించిన సాధారణ రివెంజ్ స్టోరీ ఇది కాదని స్పష్టమవుతోంది. 1947 నుంచి 1980ల మధ్యకాలంలో సికింద్రాబాద్ పరిసరాల్లో ఉన్న సవారీ తెగ ప్రజల గుర్తింపు, వారి హక్కుల కోసం సాగించిన ఆత్మగౌరవ పోరాటం చుట్టూ ఈ కథ నడుస్తుంది. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు సిద్ధం చేసిన ఒరిజినల్ డ్రాఫ్ట్‌లో తల్లి సమ్మక్క (సోనాలి కులకర్ణి), కొడుకు జడల్ (నాని) మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ మరింత డెప్త్ గా ఉండేదని, కానీ పాన్-ఇండియా అప్పీల్, మాస్ ఎలివేషన్స్ కోసం యాక్షన్ కంటెంట్ మేజర్ పోర్షన్‌ను రీ-రైట్ చేశారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. అంతేకాకుండా, మోహన్ బాబు పోషించిన శక్తివంతమైన భూస్వామి 'శికంజ మాలిక్' పాత్ర పరిధిని, రాఘవ్ జుయల్ విలనిజాన్ని పెంచడం కోసం కథా గమనంలో పలు మార్పులు చేసారని టాక్.

  
ఇది కూడా చదవండి: దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ భావోద్వేగ పోస్ట్: మరి కీర్తి సురేష్ ఏం చేస్తుందో! 

 


ఏది ఏమైనా నాని కష్టం మొత్తం స్క్రీన్ పై కనిపిస్తుంది.  అభిమానులు కూడా మెచ్చుకుంటున్నారు. కానీ బొమ్మ నడవాలంటే . ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడాలి. ముందు ముందు ప్యారడైజ్ భవిష్యత్తు కూడా ఆ ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.

 

 

[The Paradise Movie Story Rumors And Facts, The Paradise Movie Review, Nani The Paradise Story, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com