Home

»

Latest News

తెలుగు డైరెక్టర్ vs నివిన్ పౌలీ, సూరి: ఆ తెలుగు టైటిల్ ఎవరిది!

Sep 26, 2026 6:34PM

 

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, తమిళ కమెడియన్ సూరి, హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'ఏళు కడల్ ఏళు మలై'. ఈ క్రేజీ చిత్రాన్ని తెలుగులో 'సంచారి' అనే టైటిల్‌తో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తూ  పోస్టర్లని విడుదల చేసింది.


అయితే, ఈ పోస్టర్లు బయటకు రాగానే టాలీవుడ్‌ ప్రముఖ సీనియర్ దర్శకుడు 'ఆ నలుగురు' ఫే మ్ చంద్ర సిద్ధార్థ షాక్ కి గురయ్యాడు.ఎందుకంటే సంచారి'  టైటిల్ ని    తన ఫిల్మోత్సవ్  బ్యానర్‌పై కొన్ని నెలల క్రితమే ఫిల్మ్ ఛాంబర్‌లో అధికారికంగా రిజిస్టర్ చేయించుకున్నారు.దీంతో తన తదుపరి డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం రిజిస్టర్ చేసుకున్న 'సంచారి' టైటిల్‌ ని, ఎలాంటి ముందస్తు సమాచారం లేదా అనుమతి లేకుండా ఒక తమిళ డబ్బింగ్ సినిమాకు వాడేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా టైటిల్ ప్రకటన రావడంపై చంద్ర సిద్ధార్థ తన టీమ్‌తో కలిసి ఫిల్మ్ ఛాంబర్ పెద్దలను ఆశ్రయించి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాడు సాధారణంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిబంధనల ప్రకారం ఇక్కడ ముందే రిజిస్టర్ అయిన టైటిళ్లను ఇతర డబ్బింగ్ సినిమాలకు కేటాయించరు. దీంతో నివిన్ పౌలీ డబ్బింగ్ చిత్రం ఖచ్చితంగా తమ తెలుగు టైటిల్‌  మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

మరోవైపు, దర్శకుడు చంద్ర సిద్ధార్థ 'సంచారి' పేరుతో తెరకెక్కించాలనుకుంటున్న కథాంశం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కథ ప్రకారం, ఒక భారీ ఈ-కామర్స్ వ్యాపార సామ్రాజ్యంతో కోట్లు గడించిన ఒక కుబేరుడికి సడెన్‌గా హార్ట్ ఎటాక్ వస్తుంది. తాను బ్రతికేది కేవలం కొన్ని రోజుల వ్యవధి మాత్రమేనని వైద్యులు స్పష్టం చేయడంతో, ఆ కుబేరుడు తన వ్యాపారాన్ని, సిరిసంపదలను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అలా ఒక సాధారణ 'సంచారి'గా మారిన ఆ శ్రీమంతుడు రాయలసీమ ప్రాంతంలో అడుగుపెడతాడు. అక్కడ ప్రమాదంలో ఉన్న ఒక 5 గురు అపరిచితులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే, ఆ 5 మంది అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్లకు మూలకారణం తన సొంత కంపెనీ గతంలో తీసుకున్న కొన్ని కఠినమైన వ్యాపార నిర్ణయాలే అని తెలిసి ఆ కుబేరుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతాడు.


ఇది కూడా చదవండి: నాతో అసలు పని లేదు.. అయినా సరే ఆ దర్శకుడు డబ్బులు తిరిగిచ్చేశారు!

 

 

ఆ తప్పును దిద్దుకోవడానికి, ఆ రాయలసీమ గ్రామాన్ని రక్షించడానికి ఆ సంచారి ఏం చేశాడనేది ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ పాయింట్. ఒక మనిషి అసలైన విలువ అతడు సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తిపై కాకుండా, అతడి వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి అనే భావోద్వేగమైన కాన్సెప్ట్‌తో ఈ స్టోరీ లైన్ అల్లుకున్నారు. ఇలాంటి బలమైన సందేశాత్మక కథకు 'సంచారి' అనే పేరు 100% నూటికి నూరు శాతం సరిపోతుందని, అందుకే ఈ టైటిల్ హక్కుల కోసం తాము ఛాంబర్ ముందుకు వెళ్తున్నామని ఫిల్మోత్సవ్ సంస్థ స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో, నివిన్ పౌలీ సినిమా టైటిల్ మారుతుందో లేదో అని టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 

[Sanchari Movie Title Controversy In Tollywood, Sanchari Title Controversy, Filmofsav Banner , Yezhu Kadal Yezhu Malai, Nivin Pauly,chandra siddardha, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com