Home

»

Latest News

యుక్తా వార్షికోత్సవాలకు చీఫ్‌ గెస్ట్‌గా పవర్‌స్టార్..

Jul 7, 2016 3:57PM

ఉపాధి నిమిత్తం విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు ఒక సంఘంగా ఏర్పడి ఉత్సవాలు జరుపుకోవడం మనందరికి తెలిసిన విషయమే. ఆటా, తానా, నాటా ఇలా ఎన్నో సంఘాలు పరాయి దేశాల్లో తెలుగువారి అభ్యున్నతి కోసం పాటు పడుతున్నాయి. వాటి వార్సికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఇక్కడి సినీ, రాజకీయ ప్రముఖుల్ని ముఖ్యఅతిథులుగా పిలవడం ఎప్పటి నుంచో వస్తున్నదే.

అలా యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు సంఘం(యుక్తా) ఆరో వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ నెల 9న లండన్‌లో జరగనున్న ఈ వేడుకులకు పవన్ వెళుతున్నట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈస్ట్ లండన్‌లోని ట్రాక్సీ థియేటర్లో అక్కడి తెలుగు వారు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. రెండు వేలకు పైగా తెలుగు కుటుంబాలు పాల్గొననున్న ఈ వేడుకలో పవన్ పలువురు కళాకారులను సత్కరించనున్నారని, అనంతరం అక్కడి తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆ ప్రకటనలో తెలిపారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com