Home

»

Latest News

బుల్లి హీరోయిన్ బిజినెస్ మొదలెట్టింది!

Jul 1, 2016 5:48PM

హీరోయిన్ బిజినెస్ పెట్టింది అనగానే ఏదో ఊహించేసుకోకండి. ఆ పాడు ఆలోచనలు కొంచెం పక్కనపెట్టి విషయం పూర్తిగా చదవండి. మిత్రా షా అనే ఒక చిన్న హీరోయిన్ ఉందిలెండి. చిన్న హీరోయిన్ అని ఎందుకు అన్నామంటే.. అమ్మడు ఇప్పటికే 10 సినిమాల్లో నటించినప్పటికీ.. వాటిలో ఏ సినిమా ఎప్పుడు విడుదలైందో కనీసం నటించిన ఆ భామకు కూడా తెలియని సినిమాలవి. 
వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ.. హీరోయిన్ గా గుర్తింపు మాత్రం దక్కకపోవడంతో మిత్రా మనస్తాపానికి గురయ్యింది. హీరోయిన్ గా కాకపోయినా కనీసం బిజినెస్ ఉమెన్ గా అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే ధ్యేయంగా "గ్లోరియస్ హౌస్ కీపింగ్ సర్వీసెస్" అనే కంపెనీ మొదలెట్టింది అమ్మడు. మరి అమ్మడు మొదలెట్టిన బిజినెస్ ఆమెకు లాభాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com