Home

»

Latest News

అక్క కోసం పూరీలమ్మిన మంచు విష్ణు!

Jul 1, 2016 5:16PM

మంచు లక్ష్మీ నిర్వహిస్తున్న "మేము సైతం" కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలు అవసరార్ధుల కోసం కొంత సొమ్మును కష్టపడి సంపాదించడం అనేది రూల్. ఆ రూల్ కోసం ఒక్కో సెలబ్రిటీ ఒక్కో పద్ధతిని పాటించారు. రకుల్ కూరగాయలమ్మగా, రవితేజ థియేటర్ లో చిప్స్ అమ్మాడు, మోహన్ బాబు రోడ్డుపై ఇడ్లీలు, దోసలు అమ్మాడు. ఇప్పుడు మంచు విష్ణు వంతు వచ్చింది. తన అక్క మంచు లక్ష్మీ కోసం విష్ణు కూకట్ పల్లిలోని "పానీపూరి బండి" వద్ద వీక్షకులకు పానీపూరి చేసి పెట్టడంతోపాటు.. చాట్ కూడా చేసి పెట్టాడు. మంచు విష్ణును చూడడానికే కాకుండా అతడి చేతి పానీపూరి తినడానికి కూడా జనాలు గూమిగూడారు. 
ఈ "మేము సైతం" ప్రోగ్రామ్ పుణ్యమా అని అవసరమున్నవారికి సాయం అందడంతోపాటు.. సగటు సినిమా అభిమానులకు తమ ప్రియతమ నటీనటులను దగ్గర్నుంచి చూసే అవకాశం కూడా లభిస్తుంది!

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com