టాలీవుడ్ లో విషాదం.. 'మిథునం' నిర్మాత కన్నుమూత!
on Mar 16, 2023

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. 'మిథునం' వంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత మొయిద ఆనందరావు(57) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైజాగ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు.
విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు సాహిత్య, పర్యావరణ ప్రేమికుడు. పర్యావరణాన్ని రక్షించాలని కోరుతూ ఆయన అనేక పద్యాలు కూడా రాశారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత వ్యాపారస్తుడిగా ఎదిగారు. సంఘ సేవకుడిగానూ మంచి గుర్తింపు పొందారు. తన అభిరుచికి తగ్గట్లు 2012 లో 'మన అమ్మానాన్నల ప్రేమకథ' అంటూ 'మిథునం' అనే గొప్ప చిత్రాన్ని నిర్మించారు. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించారు. విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో పురస్కారాలను కూడా ఈ చిత్రం అందుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



