Home

»

Latest News

‘మెట్రో లవర్’ టీజ‌ర్ రిలీజ్‌.. మూవీ ల‌వ‌ర్స్‌కి మ‌రో కొత్త త‌ర‌హా సినిమా.!

Oct 5, 2026 6:05PM

చిన్న సినిమాలు, కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న యువ హీరో నరేన్ వనపర్తి మరో ఆసక్తికరమైన సినిమాతో వస్తున్నారు. ‘ఊరికి ఉత్తరాన’తో హీరోగా పరిచయమైన నరేన్ నటిస్తున్న రెండో చిత్రం ‘మెట్రో లవర్’. సాహితీ అవంచ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు మహేశ్ నాంపెల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మాల్య కందుకూరి, శివకుమార్ రాజంపేట, గడ్డం రవి కుమార్, సంతోష్ జాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల ‘మెట్రో లవర్’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి దర్శకుడు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను ఇప్పటికే సినిమా చూశానని, కథతో పాటు భీమ్స్ సంగీతం, కెమెరా వర్క్ తనకు బాగా నచ్చాయని ఆయన తెలిపారు. నరేన్‌కు సినిమాపై ఉన్న ప్యాషన్ టీజర్‌లోనే కనిపిస్తోందని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. దీంతో టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి.

హీరో నరేన్ మాట్లాడుతూ.. భీమ్స్ సిసిరోలియోతో తనకు సుమారు 20 ఏళ్ల పరిచయం ఉందని, ఆయన తమ కుటుంబ సభ్యుడిలాంటి వ్యక్తి అని తెలిపారు. కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించానని, నిర్మాతలు ఎంతో సహకరించారని చెప్పారు. భీమ్స్ సంగీతం అందించడంతో పాటు కథకు సంబంధించి కొన్ని కీలక సూచనలు కూడా చేయడం తమకు ఎంతో ఉపయోగపడిందని నరేన్ పేర్కొన్నారు. ‘మెట్రో లవర్’ నెక్ట్స్ లెవెల్ స్టోరీ అని, సినిమా చూసిన ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారని ఆయన అన్నారు.

మరోవైపు సంగీత దర్శకుడు భీమ్స్ కూడా ఇది అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసి చేసిన సినిమా అని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచి కాన్సెప్ట్‌తో నిజాయితీగా ఈ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. దర్శకుడు మహేశ్ నాంపెల్లి సైతం ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదని, సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు. దీంతో కొత్త కథ, కొత్త కాంబినేషన్‌తో వస్తున్న ‘మెట్రో లవర్’ నవంబర్ 20న ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

 

 

[Metro Lover, Metro Lover Movie, Metro Lover Release Date, Naren Vanaparthi, Sahithi Avancha, Metro Lover Teaser, Mahesh Nampelly, Bheems Ceciroleo, Trinadha Rao Nakkina, Telugu Movies 2026, Tollywood Latest News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com