
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాతో బన్నీ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌తో పాటు భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరగాల్సి ఉంది. దీంతో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.
ఇక బన్నీ తర్వాతి సినిమా లోకేష్ కనగరాజ్‌తో చేయనున్న విషయం ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. AA23 పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది.
2027 జనవరిలో AA23 షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘రాకా’ షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ తనకు సంబంధించిన పార్ట్‌ను డిసెంబర్ రెండో వారం నాటికి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే ‘రాకా’ షూటింగ్ పూర్తయిన వెంటనే ఆ సినిమా విడుదలకు రెడీ అయిపోదు. ఇది భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ సినిమా కావడంతో విపరీతమైన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవసరం కానుంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, ఇతర టెక్నికల్ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

మరోవైపు ‘రాకా’ షూటింగ్‌లో బన్నీ తన పార్ట్‌ను పూర్తి చేసిన తర్వాత.. జనవరి నుంచి లోకేష్ కనగరాజ్ సినిమాకు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నట్లు టాక్. అంటే ‘రాకా’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే బన్నీ AA23 షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.
ఇక లోకేష్ కూడా ఈ విషయంలో ముందుగానే ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం AA23 స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దడంతో పాటు లొకేషన్ స్కౌటింగ్ పనులు కూడా జరుగుతున్నట్లు సమాచారం.
లోకేష్ సాధారణంగా తన సినిమాలను చిన్న గ్యాప్‌లతో వరుస షెడ్యూల్స్‌లో పూర్తి చేసే స్టైల్‌కు పేరుంది. అదే విధంగా AA23 షూటింగ్ కూడా జనవరిలో మొదలై సెప్టెంబర్ వరకు కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. మధ్యలో అవసరాన్ని బట్టి చిన్న చిన్న గ్యాప్స్ ఉండే అవకాశం ఉందట.
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్-బోయపాటి కాంబో.. పెద్ద స్కెచ్ వేశారుగా.!
[AA23 Shooting Update, AA23 Movie, Allu Arjun Lokesh Movie, Allu Arjun, Lokesh Kanagaraj, Raaka Movie, Telugu Film News, Telugu Movie News]





