
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ బేస్ తెలిసిందే. మరి ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో అడుగు అడుగుకీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనపడతారు. మూతిపై సరిగ్గా మీసం మొలవని రోజునుంచే ఆ ఘనతని సంపాదించాడు. రీసెంట్ గా కర్నూల్ జిల్లా అభిమానులు తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'దేవర'మూవీలోని సూపర్ హిట్ సాంగ్ 'చుట్టమల్లె'కు సంబంధించి AI సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ఒక అసభ్యకర మార్ఫింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో కథానాయిక జాన్వీ కపూర్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్‌లకు సంబంధించిన దృశ్యాలను వికృత రీతిలో మార్ఫింగ్ చేసి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రచారం చేయడం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీలను గౌరవించే మన సంస్కృతిలో మహిళల ఆత్మగౌరవాన్ని బజారున పెట్టేలా టెక్నాలజీని వాడుకోవడం అసహ్యకరం, సిగ్గుచేటు అని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: బండ్ల గణేష్ పోస్ట్ వైరల్: దయచేసి ఆయన పేరు వాడి నా జీవితాన్ని నాశనం చేయకండి!
ఈ ఘటనపై కర్నూలు జిల్లాకి చెందిన అభిమానుల సంఘం ప్రతినిధులు మరియు అభిమానులు కర్నూలు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) ని వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. 'చుట్టమల్లె' పాట మార్ఫింగ్ వీడియో ద్వారా హీరో, హీరోయిన్ల ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా, మహిళలను అత్యంత కించపరిచేలా వ్యవహరించిన సైబర్ నేరగాళ్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీని కోరారు. ఈ వీడియోను సృష్టించిన ప్రాథమిక మూలాలను (Original Creators) గుర్తించి, ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల నుండి ఆ వీడియోలను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
[kurnool Ntr Fans kurnool SP Complaint Chuttamalle Video, NTR warning To Chuttamalle AI Morphing Video, Kurnool SP Police Complaint, Devara Movie Song, Janhvi Kapoor Deepfake, Telugu Cinema News, Telugu cinema, Tollywood News, Tollywood]
.webp)





