జూనియర్ చిరుకు నాలుగు నెలలు నిండాయి!
on Feb 22, 2021
దివంగత కన్నడ స్టార్ యాక్టర్ చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా రాజ్ తమ కుమారుడు జూనియర్ చిరు ఫొటోలను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. తమ బుడతడికి నాలుగు నెలలు నిండాయని తెలిపారు. ఈ నాలుగు నెలలు ఎంతో ఆనందంతో పాటు, నిద్రలేని రాత్రులను ఇచ్చాయని ఆమె చెప్పారు. కొడుకును 'బేబీ ప్రిన్స్'గా, 'సింబా'గా ఆమె అభివర్ణించారు. ఆమె షేర్ చేసిన జూనియర్ చిరు పిక్చర్స్ ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో బుడతడు కిరీటం సింబల్‌ను డిజైన్ చేసిన బ్లూ కలర్ డ్రస్‌లో నవ్వు ముఖంతో మెరిసిపోతున్నాడు.
ఆ ఫొటోలతో పాటు, "Its been four months of sheer happiness and sleepless nights.. forever to go! My baby prince" అంటూ క్యాప్షన్ జోడించారు మేఘనా రాజ్. ఇటీవల చిరంజీవి సర్జా సినిమా రాజమార్తండ ట్రైలర్‌ను జూనియర్ చిరు చేత ఆమె లాంచ్ చేయించారు. గత వారం కొడుకును ఒళ్లో కూర్చోపెట్టుకొని, అతని చేతి వేలిని పట్టుకొని, ట్రైలర్‌ను ప్లే చేయిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
ఆ ట్రైలర్‌ను లాంచ్ చేయడానికి ముందుగానే తన ఫ్యాన్స్‌కు ఓ వీడియో ద్వారా అధికారికంగా తన కుమారుడిని ఆమె పరిచయం చేశారు. తన భర్త దివి నుంచి కొడుకును చూసుకొని గర్విస్తుంటారని ఆమె అన్నారు. గత ఏడాది జూన్‌లో ఆకస్మికంగా గుండె ఆగిపోయి చిరంజీవి సర్జా మృతి చెందడంతో అభిమానులతో పాటు, యావత్ చిత్రసీమ షాక్‌కు గురైంది. ఆయన మృతి చెందిన నాలుగు నెలల తర్వాత అక్టోబర్ 22న మేఘనా రాజ్‌కు జూనియర్ చిరు జన్మించాడు.
Also Read