విజయదశమికి `గాడ్ ఫాదర్`!?
on May 25, 2022
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా `ఆచార్య`గా పలకరించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన సదరు చిత్రం.. ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో.. తన తదుపరి సినిమా `గాడ్ ఫాదర్`పైనే ఆశలు పెట్టుకున్నారు మెగాభిమానులు. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `లూసిఫర్` ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ డ్రామాని `హనుమాన్ జంక్షన్` ఫేమ్ మోహన్ రాజా తీర్చిదిద్దుతున్నారు.
ఇదిలా ఉంటే, `గాడ్ ఫాదర్`ని ఆగస్టులో రిలీజ్ చేయబోతున్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. విజయదశమి కానుకగా సెప్టెంబర్ చివరి వారంలో `గాడ్ ఫాదర్`ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, `గాడ్ ఫాదర్`లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ స్పెషల్ రోల్ లో ఎంటర్టైన్ చేయనుండగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనుంది. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
Also Read