'ది గ్రే మ్యాన్' ట్రైలర్.. ధనుష్ ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్
on May 25, 2022
సౌత్ లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒకడు. విభిన్న చిత్రాలు చేస్తూ తమిళ్ లో స్టార్ గా ఎదిగిన ధనుష్ నటుడిగా ఇప్పటిదాకా రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకోవడం విశేషం. భాషతో సంబంధం లేకుండా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే తాజాగా విడుదలైన ఓ ఇంగ్లీష్ మూవీ ట్రైలర్ ధనుష్ ఫ్యాన్స్ ని దారుణంగా నిరాశపరిచింది.
గతంలో 'ది ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' అనే ఇంగ్లీష్ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన ధనుష్.. 'ది గ్రే మ్యాన్' అనే మరో ఇంగ్లీష్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. జూలై 15 న యూఎస్ లో థియేటర్స్ లో విడుదల కానున్న ఈ సినిమా జూలై 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ధనుష్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం ధనుష్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది.
'ది గ్రే మ్యాన్' ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అయితే రెండు సినిమాల నిడివి గల ట్రైలర్ లో మెరుపు తీగ లాగ ధనుష్ కేవలం మూడు సెకన్లు మాత్రమే కనిపించడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఇంతకాలం ఈ సినిమాలో ధనుష్ నటిస్తున్నాడు అంటూ ప్రచారం చేశారు. కానీ ట్రైలర్ చూస్తే ధనుష్ ది ఏదో చిన్న గెస్ట్ రోల్ లా ఉందంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Also Read