కళ్యాణ్ రామ్ కి మెగాస్టార్ ట్యాగ్!
on Aug 5, 2022
నందమూరి నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్ రామ్ 'అతనొక్కడే', 'పటాస్' వంటి భారీ కమర్షియల్ సక్సెస్ లను అందుకున్నప్పటికీ ఎక్కువగా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంటాడు. తాజాగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ 'బింబిసార'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమానే ఇప్పుడు ట్విట్టర్ లో 'మెగాస్టార్ కళ్యాణ్ రామ్' అని మారుమోగేలా చేస్తోంది.
రెండు నెలలుగా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతున్నాయి. ప్రేక్షకులు థియేటర్స్ కి రావడమే పూర్తిగా తగ్గించేశారు. అసలు సినిమాలు విడుదల చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో 'బింబిసార' విడుదలైంది. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఏ సినిమాకి లేనంతగా దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇక ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బుకింగ్స్ ఇంకా జోరందుకున్నాయి. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రానున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'బింబిసార'కి వస్తున్న పాజిటివ్ టాక్, థియేటర్స్ కి ఆడియన్స్ రావడం చూసి నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సెకండ్ లాక్ డౌన్ తర్వాత బాబాయ్ బాలకృష్ణ 'అఖండ'తో ప్రేక్షకులను థియేటర్స్ వచ్చేలా చేస్తే, ఇప్పుడు అబ్బాయ్ కళ్యాణ్ రామ్ 'బింబిసార'తో ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తున్నాడని అంటున్నారు. అంతే కాదు 'మెగాస్టార్ కళ్యాణ్ రామ్' అనే హ్యాష్ ట్యాగ్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ప్రేక్షకులను మళ్ళీ థియేటర్స్ కి రప్పిస్తున్న మెగాస్టార్ అంటూ ప్రశంసిస్తున్నారు.
Also Read