'బింబిసార' కలెక్షన్ల ప్రభంజనం.. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్
on Aug 6, 2022
నందమూరి కళ్యాణ్ రామ్ నమ్మకం నిజమైంది. డెబ్యూ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ్ తో ఆయన చేసిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ 'బింబిసార' పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ప్రేక్షకులను మళ్ళీ థియేటర్స్ కి వచ్చేలా చేస్తోంది. దీంతో ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.13.50 కోట్ల బిజినెస్ చేసిన బింబిసార.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటి రోజు 6.30 కోట్ల షేర్(9.30 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. ఫస్ట్ డే నైజాంలో రూ.2.15 కోట్ల షేర్(బిజినెస్ 5 కోట్లు), సీడెడ్ లో రూ.1.29 కోట్ల షేర్(బిజినెస్ 2 కోట్లు), ఆంధ్రాలో రూ.2.86 కోట్ల షేర్(బిజినెస్ 6.50 కోట్లు) రాబట్టింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాల్లో 3.09 కోట్ల షేర్ తో 'ఇజం' మూవీ ఇప్పటిదాకా టాప్ లో ఉండగా.. ఇప్పుడు బింబిసార దానిని డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసింది.
కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా 0.32 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 0.65 కోట్ల షేర్ కలిపి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.7.27 కోట్ల షేర్ (11.50 కోట్ల గ్రాస్) వసూలు చేసింది బింబిసార. వరల్డ్ వైడ్ గా రూ.15.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఫస్ట్ డేనే 45 శాతం రికవర్ చేయడం విశేషం. ప్రస్తుత జోరు చూస్తుంటే ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్(మొదటి మూడు రోజులు)లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకునేలా ఉంది.