Home

»

Latest News

చిరును ఫాలో అవుతున్న దేవీశ్రీ..!

May 14, 2016 10:57AM

మెగా ఫ్యామిలీకి దేవీ శ్రీ ఇచ్చిన హిట్ ట్యూన్స్ మరే మ్యూజిక్ డైరెక్టరూ ఇవ్వలేదు. చిరుతోనే కాక, పవన్, చరణ్, బన్నీలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు దేవి. లేటెస్ట్ గా మెగా 150 సినిమాకు కూడా దేవినే మ్యూజిక్ చేస్తున్నాడు. కత్తిలాంటోడు అనే వర్కింగ్ టైటిల్ ను అనుకుంటున్న ఈ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికే మొదలైపోయాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ తో దిగిన సెల్ఫీని డిఎస్పీ తన ట్విట్టర్లో పెట్టాడు. బాస్ తో కలిసి మొదటిరోజు డిస్కషన్స్, వెల్కమ్ బ్యాక్ సర్, వి లవ్ యు అంటూ ట్వీట్ చేశాడు. స్మైల్ ఇస్తూ చిరు ఇచ్చిన స్టిల్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. చిరు గడ్డం స్టైల్ నే దేవీశ్రీ కూడా ఫాలో అవడం విశేషం. తమ అన్నయ్య సినిమాకు దేవి తిరుగులేని మ్యూజిక్ ఇవ్వాలని, కమ్ బ్యాక్ ఫిలిమ్ మెగాస్టార్ కు మెమరబుల్ గా ఉండిపోవాలని మెగాఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com