
ఐశ్వర్యరాయ్ కేన్స్ ఉత్సవంలో మెరిసిపోయింది. బంగారు వర్ణ గౌనులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాను ఎండోర్స్ చేస్తున్న లోరియల్ ప్యారిస్ బ్రాండ్ తరపున కేన్స్ కు హాజరైంది ఐశ్వర్య. అయితే ఈ ఉత్సవాల్లోనే, ఐశ్వర్య దల్బీర్ కౌర్ గా నటించిన సరబ్ జిత్ ప్రీమియర్ షో కూడా ఉండటం విశేషం. అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్య దాదాపు రెగులర్ గెస్ట్ అనే చెప్పాలి. ఈ ఏడాది కేన్స్ లో బాలీవుడ్ నటీమణుల ఐశ్వర్య, సోనమ్ కపూర్, మల్లికా శెరావత్ లు మెరుస్తున్నారు. తెలుగు సినిమా బాహుబలి కూడా ఈసారి కేన్స్ లో ప్రీమియర్ షో చోటు చేసుకోవడం విశేషం.









