
శాండిల్‌వుడ్‌కు షాక్.. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన ఘటనలో కన్నడ నటి మైత్రేయిగౌడకు న్యాయస్థానం రెండేళ్లు జైలు శిక్ష విధించింది. 2011లో నటి మైత్రేయిగౌడ తన స్నేహితురాళ్లు సుప్రియ, రూపా, రేఖతో కలిసి బెంగళూరులో ఓ వైపు డ్రైవింగ్ చేస్తూ మరో వైపు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోంది.
కారు బసవేశ్వర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే ఆమె సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ కారును అడ్డుకున్నారు. దీంతో నా కారునే అడ్డుకుంటావా అంటూ మైత్రేయిగౌడ ఆగ్రహంతో ఊగిపోయారు. తన స్నేహితురాళ్లతో కలిసి కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. ఈ ఘటనపై బసవేశ్వరనగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. సుధీర్ఘ విచారణ అనంతరం నిన్న బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. నేరం రుజువు కావడంతో మైత్రేయిగౌడకు రెండేళ్లు, ఆమె స్నేహితురాళ్లుకు ఏడాది చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో కన్నడ చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైంది.






