జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తున్నాను : మెగాస్టార్
on Sep 2, 2023
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు అంటే మెగాభిమానులు పర్వదినంగానే భావిస్తారు. తమ అభిమాన హీరో పుట్టినరోజును ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈసారి పవన్ పుట్టినరోజుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఓ పక్క చేతి నిండా సినిమాలు, మరోపక్క రాజకీయంగా బిజీ షెడ్యూలు... ఇలా ప్రజలకు, ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్న పవర్‌స్టార్ మూడు సినిమాలు చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త సినిమాని కూడా ఓకే చేశారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ వేశారు. ‘జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జనహృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ.. నీకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ మెగాస్టార్ వేసిన పోస్టు అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఓ పక్క కుటుంబ సభ్యుల శుభాకాంక్షలు, మరోపక్క అభిమానుల హంగామాతో పవర్‌స్టార్ తన పుట్టినరోజును ఎంతో సందడిగా జరుపుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



