భోళాకి బైబై.. యుఎస్ కి హాయ్ హాయ్.. కొత్త సినిమా కబురు పంచుకున్న చిరు!
on Jul 7, 2023

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోనూ భలే యాక్టివ్ గా ఉంటుంటారు. అభిమానులతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కబుర్లు పంచుకుంటుంటారు. నిన్నటికి నిన్న 'భోళా శంకర్'కి డబ్బింగ్ పూర్తయ్యిందని.. సినిమా బాగా వచ్చిందని.. తప్పకుండా మంచి మాస్ ఎంటర్టైనర్ అవుతుందని ట్వీట్ చేశారు చిరు. అలాగే మీ క్యాలెండర్స్ ని మార్క్ చేసుకోండని.. థియేటర్స్ లో కలుద్దాం అంటూ సెలవిచ్చారు.
కట్ చేస్తే.. ఈ రోజు (జూలై 7) తన సతీమణి సురేఖ సమేతంగా యుఎస్ కి చిన్నపాటి హాలీడే వెకేషన్ కి వెళుతున్నానని.. రిఫ్రెష్ అయి వచ్చాక గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ (కూతురు సుస్మిత నిర్మాణ సంస్థ) వారి హిలేరియస్ ఎంటర్టైనర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నానని.. చిరు ట్విట్టర్ లో కొత్త సినిమా కబురు పంచుకున్నారు.

కాగా, చిరంజీవి తదుపరి చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నట్లు ఇప్పటికే కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ ప్రారంభమయ్యే అవకాశముందంటున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా త్రిష కనిపించనుండగా.. సిద్ధు జొన్నలగడ్డ - శ్రీలీల మరో జంటగా దర్శనమివ్వనున్నారట. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నారని బజ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



