Home

»

Latest News

Chiraneevi: ఆ రహస్యాన్ని చెప్పేసిన చిరంజీవి.. ఫ్యాన్స్ ఏమంటారో మరి 

May 23, 2026 9:29AM

 

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి(Chiranjeevi),బాబీ(Bobby)ప్రాజెక్ట్ అధికారకంగా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రమోషన్ లో భాగంగా రీసెంట్ గా  మేకర్స్ రిలీజ్ చేసిన 'స్పిరిట్ ఆఫ్ మెగా158' ట్రాన్స్‌ఫార్మేషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది


 సదరు వీడియోలో  చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా అని టైటిల్ చెప్పబోతుంటే బాబీ పరుగెత్తుకుంటూ వచ్చి ఆపుతాడు.దాంతో చిరంజీవి మాట్లాడుతూ ఈ బాబీ నన్ను ఆపలేడు. సరైన సమయం చూసి నేనే టైటిల్ లీక్ చేస్తాను అని చెప్తాడు. దీంతో చిరంజీవి నుంచి టైటిల్ ప్రకటన వస్తుందేమో అని ఫ్యాన్స్ సోషల్ మీడియాతో పాటు చిరంజీవికి సంబంధించిన అన్ని కార్యక్రమాల వివరాలని గమనిస్తూ వస్తున్నారు. ఇక బాబీ మెగాస్టార్ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు కావడంతో, వాల్తేరు వీరయ్యని  మించిన పవర్‌ఫుల్ ఎలివేషన్స్, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 


Also read: Cannes Film Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దారుణం.. హోటల్ గదినిండా ఉన్న రక్తపు మరకలు ఈమెవేనా! 

ఈ భారీ ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. కన్నడ, తమిళం, హిందీ భాషల్లో సక్సెస్ ఫుల్ సినిమాలు అందించిన ఈ బ్యానర్‌కు ఇదే మొదటి టాలీవుడ్ డెబ్యూ కావడం విశేషం. సాంకేతిక విభాగానికి వస్తే, 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రాక్‌స్టార్ ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీత బాణీలు సమకూరుస్తున్నారు. ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నట్లు గట్టి ప్రచారం సాగుతోంది.  2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందని టాక్.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com