
హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీస్ లో 'రౌడీ జనార్ధన'(Rowdy janardhana)ఒకటి. 'రాజావారు రాణిగారు' ఫేమ్ రవికిరణ్ కోలా(Ravikiran KOla)దర్శకత్వంలో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తే అంచనాలని ఇంకొంచం పెంచుకోవడంలో తప్పు లేదని అనిపిస్తుంది. తాజాగా రౌడీ జనార్దనకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ సినీ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది.
మూవీలోని పాటల బాధ్యతని బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన స్టార్ కంపోజర్ విశాల్ మిశ్రా చేపట్టనున్నారు. 'కబీర్ సింగ్' చిత్రంలోని 'కైసే హువా' పాటతో పాటు రీసెంట్‌గా 'యానిమల్', 'టాక్సిక్' వంటి భారీ చిత్రాలకి అదిరిపోయే సంగీతాన్ని అందించిన విశాల్ మిశ్రా, ఇప్పుడు 'రౌడీ జనార్ధన' కోసం అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలని మరో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో జేవియర్ చేపట్టనున్నారు. 'భ్రమయుగం' సినిమాతో తన విలక్షణమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో థియేటర్లలో ప్రేక్షకులని భయపెట్టి, మైమరపించిన క్రిస్టో జేవియర్.. 'రౌడీ జనార్ధన'లోని ఇంటెన్స్ యాక్షన్ సీన్లకు తన మార్క్ రీ-రికార్డింగ్‌తో గూస్‌బంప్స్ తెప్పించడానికి రెడీ అవుతున్నారు. ఇలా ఒకే సినిమా కోసం ఇద్దరు వేర్వేరు సూపర్ టాలెంటెడ్ సంగీత దర్శకులు కలిసి పని చేయనుండటం టాలీవుడ్‌లో ఒక రేర్ కాంబినేషన్‌గా నిలిచింది.
Also read: Chiraneevi: ఆ రహస్యాన్ని చెప్పేసిన చిరంజీవి.. ఫ్యాన్స్ ఏమంటారో మరి
ఇటీవలే విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'రౌడీ జనార్ధన' స్పెషల్ గ్లింప్స్ అండ్ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేసింది. భారీ వర్షంలో చేతిలో రివాల్వర్‌తో, రగ్గడ్ లుక్‌లో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు మాస్ అభిమానులకి పూనకాలు తెప్పించింది. "ప్రపంచంతో పోరాడే మనిషి.. కానీ ప్రేమకు మాత్రమే తలవంచుతాడు" అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో విడుదలైన ఈ రొమాంటిక్ అండ్ యాక్షన్ పోస్టర్ సినిమాపై అంచనాలను 200 శాతం పెంచేసింది. ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామాని 2026 డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సరసన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh)జత కడుతున్న విషయం తెలిసిందే.






