Home

»

Latest News

Cannes Film Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దారుణం.. హోటల్ గదినిండా ఉన్న రక్తపు మరకలు ఈమెవేనా! 

May 23, 2026 8:53AM

 


ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇప్పుడు ఒక అపఖ్యాతిని మూటగట్టుకుంది. గ్లామర్, సినిమా వేడుకలకి , విలాసవంతమైన ఫ్యాషన్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ అంతర్జాతీయ వేదికపై ఇటీవల జరిగిన ఒక ఘోర సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. 


2025  మిస్ వెనిజులా  ప్రముఖ మోడల్ ఆండ్రియా డెల్ వాల్‌(andrea del val)పై హోటల్ రూమ్ లో సెలబ్రిటీ స్టైలిస్ట్ లగునా  కత్తెర తో దాడి చేసి గాయపరచడం జరిగింది. ఈ విషయాన్ని ఆండ్రియానే వెల్లడి చేయడంతో పాటు ముఖంపై రక్తపు గాయాలని చూపిస్తూ సోషల్ మీడియాలో అందుకు సంబంధిచిన వీడియో కూడా పోస్ట్ చేసింది. గది కూడా చిందరవందరగా ఉంది. సదరు వీడియోలో లగునా కూడా ఉన్నాడు. ఇక  లగునా పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆండ్రియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం. 



   

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com