మెగాస్టార్ గురించి వర్రీ అవ్వకు, నీ గురించి కాస్త ఆలోచించు
on Dec 31, 2017
కొన్ని దశాబ్దాలు తిరుగులేని రారాజుగా టాలీవుడ్ ని ఏలిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నం 150 తో సరయిన కం బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం తన డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహా రెడ్డి తో బిజీ గా ఉన్నాడు. ఈ మధ్యే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఖైదీ నం 150 తో ప్రాఫిట్స్ కొట్టిన చరణ్, ఇండియా లో టాప్ యాక్టర్స్ అండ్ టెక్నిషన్స్ ని సైరా కోసం సైన్ చేసాడు. స్క్రిప్ట్ దగ్గర నుండి ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతూ, తన తండ్రికి మరచిపోలేని హిట్ ఇచ్చే పనిలో ఉన్నాడు చెర్రీ.
అయితే, చిరు విషయంలో ఇంత కేర్ తీసుకుంటున్న చరణ్, తన సొంత సినిమా రంగస్థలం ని పక్కకు పెట్టాడు. పక్కకు పెట్టాడు అంటే, ప్రాజెక్ట్ ఆపేసాడు అని కాదు అర్ధం. కానీ, తన ఫోకస్ మొత్తం సైరా మీదే ఉంచుతున్నాడు. ఈ క్రమంలో రంగస్థలం ని ఒకింత డిలే చేస్తున్నాడు. ఇప్పటికే బాగా డిలే అయిన ఈ సినిమాని సమ్మర్ కి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చిరంజీవి అనే వ్యక్తి పేరు టాలీవుడ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంది. కాబట్టి, వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న చరణ్ తన సొంత కెరీర్ పైన ధ్యాస పెడితే మంచిది. వాస్తవానికి, ఇప్పుడు ఉన్నఫలంగా హిట్ కావలసింది చరణ్ కి కాని చిరు కి కాదు. సో, సైరా గురించి ఆలోచించడంతో పాటు రంగస్థలం పైన కూడా కాస్త ఇంటరెస్ట్ పెడితే మంచిది అంటున్నారు విశ్లేషకులు.