చిరంజీవి వినయవిధేయతలకు ఇదే నిదర్శనం
on Apr 25, 2017

చిరంజీవి..సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాను మకుటం లేని మహారాజుగా ఏలిన వ్యక్తి. ఎవరు కాదన్నా..అవునన్నా ఇది నిజం. స్వతహాగా ఆయనకు వినయవిధేయతలు చాలా ఎక్కువ. తన కన్నా పెద్దవారు కనిపిస్తే చాలు వెంటనే వారి ఆశీర్వదం తీసుకుంటారు. ఆయన సినిమాల్లో బుడి బుడి అడుగులు వేసినప్పటి నుంచి మెగాస్టార్‌గా..ఎంపీగా శిఖరంపై ఉన్నా నేటీకి ఆ అలవాటును మరచిపోలేదంటే చిరంజీవి వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడంతో టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు..
దీనిలో భాగంగా ఆయనను అభినందించడానికి స్వయంగా చిరంజీవి విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో విశ్వనాథ్‌ను అభినందిస్తూ ఫోన్‌లు రావడంతో వాటిని లిఫ్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇది గమనించిన చిరు ఆయనను డిస్ట్రబ్ చేయకుండా వేచి ఉన్నారు. చిరు వేచి ఉండటాన్ని చూసిన ఆయన ఫోన్ మాట్లాడుతూనే వచ్చి కూర్చోమని చెప్పారు.. కానీ అందుకు ససేమిరా అన్న మెగాస్టార్..ఫోన్ మాట్లాడం అయిన తర్వాత విశ్వనాథ్ గారి కాళ్లకు నమస్కరించి ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు..ఇది చూసిన వారంతా మెగాస్టార్ అంటే ఇదే అని అనుకున్నారు. అక్కడున్న అభిమానుల్లో ఒకరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది ఇప్పుడు వైరల్ అయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



