నాని 'మీట్ క్యూట్' టీజర్ అప్డేట్ వచ్చేసింది
on Nov 11, 2022

నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా 'మీట్ క్యూట్' అనే అంథాలజీ ఫిల్మ్ తో దర్శకురాలిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. నాని సొంత బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్ర షూటింగ్ గతేడాదే షూటింగ్ ప్రారంభమైంది. అయితే కొద్ది నెలలుగా ఈ ఫిల్మ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా టీజర్ మరియు రిలీజ్ కి సంబంధించిన అప్డేట్స్ తో సర్ ప్రైజ్ చేసింది మూవీ టీమ్.
నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా టీజర్ ని రేపు(నవంబర్ 12) విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ టైటిల్ కి తగ్గట్టు క్యూట్ గా ఆకట్టుకునేలా ఉంది.
రుహాని శర్మ, ఆకాంక్షసింగ్, ఆదా శర్మ, వర్షబొల్లమ్మ, రోహిణి, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గేనిన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ ఫిల్మ్ తో నాని సోదరి దీప్తి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



