'గుడుంబా శంకర్' హీరోయిన్ రి-ఎంట్రీ!
on Jan 20, 2022

నటి మీరా జాస్మిన్ సినిమాల్లోకి రి-ఎంట్రీ ఇస్తోంది. మలయాళీ అయిన మీరా 'అమ్మాయి బాగుంది' (2003) సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, పవన్ కల్యాణ్ జోడీగా 'గుడుంబా శంకర్', రవితేజ సరసన 'భద్ర', రాజశేఖర్ చెల్లెలిగా 'గోరింటాకు' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. 2016 తర్వాత సినిమాలకు దూరమైన ఆమె ఇప్పుడు 'మకల్' అనే మలయాళం సినిమాలో నటిస్తోంది. బరువుతగ్గి స్లిమ్‌గా తయారైన ఆమె, ఇక కంటిన్యూగా సినిమాలు చేయాలని భావిస్తోంది.
Also read: ధనుష్, ఐశ్వర్యను కలిపేందుకు రజనీ విఫలయత్నం!
ప్రస్తుతం నలభైల్లోకి అడుగుపెట్టిన మీరా సోషల్ మీడియాలోనూ తాజాగా అడుగుపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 'మీరాజాస్మిన్' పేరుతో హ్యాండిల్ ప్రారంభించింది. 'మకల్' సినిమాకు చెందిన తన లుక్‌ను ఫస్ట్ పోస్ట్‌గా షేర్ చేసింది. "ఎల్లప్పుడూ ప్రారంభాలను పోషణ చేద్దాం. కొన్నిసార్లు, ఇది ఎక్కడో ఉండటం గురించి కాదు, ఆ మార్పుకు సంబంధించిన విత్తనాల గురించి. మనందరినీ ఒకరికొకరం దగ్గర చేసేలా, ఒక్కోసారి ఒక్కో జ్ఞాపకం వచ్చేలా చేసే ఈ అడుగు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అందరికీ ప్రేమనూ, ప్రకాశాన్నీ పంపుతున్నా" అని ఆమె రాసుకొచ్చింది.
Also read: చలికాలంలో వేడిపుట్టిస్తున్న పూజ!
2014లో దుబాయ్‌కు చెందిన అనిల్ జాన్ టైటస్ అనే ఇంజనీర్‌ను వివాహం చేసుకుంది మీరా. తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా 'మోక్ష' (2013). రి-ఎంట్రీతో ఆమె మళ్లీ ఆడియెన్స్‌ను అలరిస్తుందని ఆశిద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



