Home

»

Latest News

రవితేజకి క్రాక్..

Sep 3, 2016 12:42PM

రవితేజ..తెలుగు తెరపై ఎనర్జీటిక్ యాక్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్..గ్యాప్ లేకుండా సంవత్సరానికి రెండు సినిమాలు విడుదల చేసే ఈ మాస్ మహరాజ్‌కు ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చింది. బెంగాల్ టైగర్ తర్వాత రవి సినిమా మళ్లీ పట్టాలెక్కలేదు. దిల్‌రాజుతో సినిమా ఓకే కాలేదు..కొత్త దర్శకులు కథలు నచ్చడం లేదు..అయితే రవికి ఇన్నాళ్లకు సరైన కథ దొరికిందట. పవర్‌తో తనకు మంచి హిట్టిచ్చిన కేఎస్ రవీంద్ర అలియార్ బాబీ తీసుకొచ్చిన కథ రవితేజకు బాగా నచ్చడంతో దీన్ని ఫైనల్ చేసినట్లు ఫిలింనగర్‌ టాక్. సర్దార్  గబ్బర్ సింగ్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత బాబీని రవితేజ ఇంతగా నమ్మడానికి కారణం స్క్రిప్ట్‌ మీద ఫుల్ కాన్ఫిడెన్స్‌‌‌గా ఉండటమే. ఈ సినిమాకు క్రాక్ అనే పేరును అనుకుంటున్నారట...మూవీలో హీరో పాత్ర పోలీస్ గెటప్‌తో పాటు, బిహేవియర్ కూడా క్రాక్ అనిపించుకునేలా ఉంటుందని, అందుకే టైటిల్‌గా క్రాక్‌ను‌ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మొత్తామ్మీద ఈ నెలాఖరు నుంచే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లబోతుందట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com