
సినిమా కథలంటే ఎక్కడి నుంచో పుట్టినవి కావు..సమాజంలో మనం నిత్యం గమనించేది..మన చుట్టూ జరిగేది కళ్లకు కట్టినట్లు చూపించేదే సినిమా. అలా పర్యవరణం గురించి ఆలోచించే ఒక వ్యక్తికి..సాటి మనిషికి కష్టం వస్తే చూడలేని మరో వ్యక్తి జత కలిస్తే అన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమా కథ విషయంలో దర్శకుడు ఎంత కష్టపడ్డాడో తెలియదు గాని మేనరికం అనే ఒక సంప్రదాయం విషయంలో మాత్రం డైరెక్టర్ కొరటాల శివ మెచ్యూర్డ్‌గా ఆలోచించినట్లున్నాడు. జనతా గ్యారేజ్‌లో హీరో ప్రకృతి ప్రేమికుడు..బాగా చదువుకున్నవాడు అలాంటి వాడు తన మావయ్య కూతుర్ని ప్రేమిస్తాడు..మేనరికం చేసుకోవడానికి సిద్ధపడతాడు. మేనరికం చేసుకోవడంపై మన సమాజంలో భిన్న వాదనలున్నాయి. ఎంతో తెలివిగా ఆలోచించే హీరో మేనరికం విషయాన్ని పట్టించుకోకపోవడాన్ని గుర్తించిన దర్శకుడు కొరటాల సెకాండాఫ్‌లో ఆ తప్పును సరిదిద్దాడు. అందుకే జనతా గ్యారేజ్ కోసం సమంతను ఎన్టీఆర్ వదులుకునే సీన్ క్రీయేట్ చేసినట్లున్నాడు.




.jpg)

