.jpg)
వెండితెరపై గంభీరమైన పాత్రల్లో ఒదిగిపోతుంటాడు నందమూరి బాలకృష్ణ. సెట్లో.. బయటా మాత్రం అందరితో కలివిడిగా కలసిపోతుంటారు. చిన్న చిన్న ఆర్టిస్టులతో కూడా సరదాగా ఉంటారు. సీరియర్లంటే గౌరవం చూపిస్తుంటారు. గౌతమి పుత్ర శాతకర్ణి సెట్లో కూడా అదే జరుగుతోంది. ఈ సినిమాలో తొలిసారి బాలయ్యతో కలసి నటిస్తున్నారు సీనియర్ నటీమణి హేమా మాలినీ. తొలిసారి ఆమె ఇటీవలే సెట్లో అడుగుపెట్టారు. ఆమెను తగిన విధంగా గౌరవించుకోవాలి కదా? అందుకే బాలయ్య ఆమెకు ఓ ప్రత్యేక బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు. తొలిరోజున షూటింగ్ ముగిసి పేకప్ చెబుతున్నప్పుడు హేమా మాలినీకి ఓ చీర బహూకరించారట బాలయ్య. ఊహించని గిఫ్ట్ లభించినందుకు... హేమా మాలినీ కూడా షాకయ్యారని, ఆ చీర చూసి మురిసిపోయారని తెలుస్తోంది. స్త్రీలను గౌరవించే చక్రవర్తి గౌతమి పుత్రగా.. నటిస్తున్నారు బాలకృష్ణ. బాలయ్య తల్లి పాత్రలో హేమా కనిపించనున్నారు. ఆమెని ఇలా గౌరవించుకోవడంతో ఆ సినిమాకే కాదు, పాత్ర తాలుకూ ఔచిత్యం కూడా పెరిగింది. గ్రేట్ గోయింగ్... బాలయ్యా...!






