Home

»

Latest News

మన్మథుడు... ప్లాన్ ప్రకారమే!

Apr 27, 2019 12:23PM

 

నాగార్జున సినిమా వచ్చి ఆరు నెలలు అవుతోంది. గతేడాది నానితో కలిసి నటించిన 'దేవదాస్' తరవాత ఆయన నుంచి మరో సినిమా థియేటర్లలోకి రావడం లేదు. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వేసవి ఆఖరుకు సినిమా పూర్తి చేసి ఇస్తానని రాహుల్ రవీంద్రన్ మాట ఇచ్చాడట. తరవాత మంచి తేదీ చూసుకుని సినిమాను విడుదల చేయడమే. అందుకని, ఇప్పటినుంచి ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు షూటింగ్ అప్‌డేట్స్‌ ఇస్తూ... సినిమాను వార్తల్లో ఉండేలా చూస్తున్నారు. క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

నాగార్జున సోలో హీరోగా నటించిన 'ఆఫీసర్' బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఇక, నానితో కలిసి నటించిన 'దేవదాస్' సోసోగా ఆడింది. ఆ సినిమాల ప్రభావం 'మన్మథుడు 2'పై పడకూడదని జాగ్రత్త పడుతున్నారు. ప్లాన్ ప్రకారం స్టిల్స్ విడుదల చేస్తున్నారు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి... 'ఆఫీసర్', 'దేవదాస్' సినిమాల్లో కంటే 'మన్మథుడు 2'లో నాగార్జున మరింత హ్యాండ్స‌మ్‌గా ఉన్నారు. పోర్చుగ‌ల్‌లో నాగార్జున‌, ర‌కుల్ జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తున్న వీడియో విడుదల చేయడం కూడా ప్లాన్‌లో భాగ‌మే. సినిమాలో నాగార్జున ఫిట్‌నెస్ లెవ‌ల్స్ చూపించేలా, అక్కినేని అభిమానుల కోసం రెండు మూడు సన్నివేశాలను రాహుల్ రవీంద్రన్ రాశాడు. ఆ సంగతి ముందే చెప్పేసిన దర్శకుడు, మిగతా ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. అదీ సంగతి!!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com