Home

»

Latest News

మహేష్... సరిలేరు నీకెవ్వరూ!

Apr 27, 2019 10:24AM

 

మ‌హేష్‌బాబుకు ఎవరు సరిలేరు అంటున్నది ఘట్టమనేని అభిమానులు కాదు, దర్శకుడు అనిల్ రావిపూడి. 'మ‌హ‌ర్షి' తరవాత అతడి దర్శకత్వంలో సూప‌ర్‌స్టార్‌ మహేష్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫామిలీ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందనున్న ఆ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరూ' టైటిల్ ఖరారు చేశారని టాక్. ఇందులో అజయ్ జోసెఫ్ పాత్రలో మహేష్ కనిపిస్తారట. క్యారెక్టరైజేషన్, అందులో మహేష్ పెర్ఫార్మన్స్ సినిమాకు హైలైట్ అట. ప్రస్తుతం మహేష్ ఫారిన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇండియా వచ్చిన తరవాత 'మహర్షి' పబ్లిసిటీ మీద దృష్టి పెడతారు. తరవాత అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ చేస్తారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్. విజయశాంతి, బండ్ల గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది (2020) సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com