Home

»

Latest News

Agadha: 'అగధ'తో అలనాటి స్టార్ హీరోయిన్ మనవరాలు గ్రాండ్ ఎంట్రీ!

Apr 30, 2026

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందారు మంజుల. ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, మగాడు, నేరం నాది కాదు ఆకలిది, ఏయన్నార్ తో దొరబాబు, బంగారు బొమ్మలు, మహాకవి క్షేత్రయ్య, కృష్ణతో మాయదారి మల్లిగాడు, రక్తసంబంధాలు, శోభన్‌బాబుతో మంచి మనుషులు, పిచ్చిమారాజు వంటి ఎన్నో సూపర్ హిట్స్ లో నటించారు. ఇప్పుడు ఆమె మనవరాలు తెలుగు తెరకు పరిచయమవుతోంది.

మంజుల కూతురు వనితను 'దేవి'తో నటిగా పరిచయం చేశారు ఎం.ఎస్. రాజు. ఇప్పుడు మంజుల మనవరాలు, వనిత కుమార్తె జోవికా విజయ్ కుమార్‌ను 'అగధ'తో నటిగా పరిచయం చేస్తున్నారు ఎంఎస్ రాజు. ఇందులో ఆమె పాత్ర పేరు 'హరిణి'. ఆమె క్యారెక్టర్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. 

జోరున కురుస్తోన్న వర్షంలో చేతిలో కత్తి పట్టుకొని జోవికా అద్భుతమైన రూపంలో కనిపిస్తుంది. ఆమె కళ్ళలో కనిపిస్తున్న అమాయకత్వం, అదే సమయంలో దాగి ఉన్న ఒక రహస్య శక్తి సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇది కథ యొక్క ఆధ్యాత్మిక, మర్మమైన మూలాలతో గాఢంగా ముడిపడి ఉన్న పాత్రను సూచిస్తుంది.

‘అగధ’ కు సంబంధించి ఇప్పటివరకూ విడుదల చేసిన అన్ని పోస్టర్లు ఈ సినిమా తాలూకు ఇంటెన్సిటీ ని ఆవిష్కరించే విధంగా ఉన్నాయి.

ఎం. ఎస్. రాజు రచన, దర్శకత్వం లో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

85 రోజుల షూటింగ్, విస్తృతమైన సెట్ వర్క్, దాదాపు 45 నిమిషాల విఎఫ్ఎక్స్ తో, ‘అగధ’ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com