Home

»

Latest News

Kara Movie X Review: 'కర' మూవీ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ ఖాతాలో మరో హిట్ పడిందా?

Apr 30, 2026

తమిళ స్టార్ ధనుష్ (Dhanush) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కర' (Kara) నేడు (ఏప్రిల్ 30) థియేటర్లలోకి వచ్చింది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ధనుష్ నటన నెక్స్ట్ లెవెల్ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. (Kara Twitter Review)

ట్విట్టర్ రివ్యూ: ధనుష్ విశ్వరూపం!
సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం, 'కర' ధనుష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోనుంది. 1991 గల్ఫ్ వార్ నేపథ్యంలో సాగే ఈ కథలో ధనుష్ నటన అత్యద్భుతంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. 

సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే బ్యాంక్ రాబరీ సీక్వెన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయని టాక్. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సినిమాలో సెంటిమెంట్ సీన్లు కూడా బాగా పండాయట.

సాంకేతిక నిపుణుల మ్యాజిక్
దర్శకుడు విఘ్నేష్ రాజా స్క్రీన్ ప్లేను ఎంతో గ్రిప్పింగ్‌గా మలిచారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను హ్యాండిల్ చేసిన తీరు అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఇక జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. యాక్షన్ సీక్వెన్సుల్లో ఆయన ఇచ్చిన స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోందని టాక్. 

విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. కొన్ని గ్రామీణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు నెమ్మదిగా సాగినప్పటికీ, ధనుష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ లోటును భర్తీ చేసిందని అంటున్నారు. మొత్తానికి 'కర' సినిమాతో ధనుష్ బాక్సాఫీస్ వద్ద మరో హిట్ కొట్టినట్లే కనిపిస్తోంది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com