Home

»

Latest News

Dhurandhar 2: ధురంధర్ 2 లోని ఆ ఎపిసోడ్ రియలా, గ్రాఫిక్స్ నా!

Apr 30, 2026

 

ధురంధర్ 2(Dhurandhar 2)సాధించిన విజయం తాలూకు వివరాలని వివరించడానికి వారం కూడా చాలదు. 1900 కోట్లకు పైగా కలెక్షన్స్ అంటే ఆ మాత్రం టైం పడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువ టైం తీసుకోకుండా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ధురంధరుడి తాజా న్యూస్ చూసేద్దాం. 

ధురంధర్ 2 లో ఉన్న ఎన్నో హైలెట్స్ లో  క్లైమాక్స్ సీన్స్ ఒకటి. ఒక రకంగా అన్ని హైలెట్స్ ని మించి అని చెప్పవచ్చు. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మోతతో సాగే సీన్   ఆడియెన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ సీన్ గురించి రీసెంట్ గా ధురంధర్ కి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌  గా పని చేసిన  విశాల్‌ త్యాగి(Vishal Tyagi)మాట్లాడుతు ఫైర్‌తో కూడిన సన్నివేశాల కోసం గ్రాఫిక్స్‌ వద్దని ఆదిత్య ధర్ మాకు ముందుగానే చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ఆ సీన్స్‌  రియల్‌గానే చేశాం. చివర్లో వచ్చే బ్లాస్ట్‌ సీన్ కోసం చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా రణ్‌వీర్‌ కి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసుకున్నా భద్రత విషయంలో చాలా ఆందోళన చెందాం. మొదట 250 లీటర్ల పెట్రోల్ వాడాలని ప్రొడక్షన్‌ టీమ్‌ చెప్పింది. కానీ 500 లీటర్లు ఉంటేనే అవుట్‌ పుట్‌ బాగా వస్తుందని చెప్పాం. దీంతో పాటు 25 కేజీల పేలుడు పదార్థాలు వాడాం. షూటింగ్‌ పూర్తయ్యాక అద్భుతమంటూ నన్ను, టీమ్‌ని రణ్‌వీర్‌ అభినందించారు’ అని విశాల్ త్యాగి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


Also read: Vaishnavi Chaitanya: బేబీ వైష్ణవి చైతన్య తడబాటు.. అండగా హీరో, దర్శకుడు 


ధురంధర్ 2 వచ్చిన కొత్తలో  ఈ సీన్ పై  కొంత మంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు గ్రాఫిక్ లో క్రియేట్ అయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు విశాల్‌ త్యాగి మాటలతో వాళ్లంతా అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ బాగా అయ్యింది కదా నీకు అని వాళ్లకి వాళ్లే అనుకోవాల్సిన పరిస్థితి.    

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com