స్టైల్ మార్చిన మణిరత్నం... ఫోకస్ చేస్తున్నారా?
on Mar 25, 2023
ప్రముఖ డైరక్టర్ మణిరత్నం స్టైల్ మార్చారా? మొన్న మొన్నటిదాకా సినిమా మీద మాత్రం ఫోకస్ చేసే ఆయన, ఇప్పుడు పబ్లిసిటీ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారా? ఆయన వైఖరి చూస్తుంటే, అది నిజమేననిపిస్తోందని అంటున్నారు క్రిటిక్స్. ఎప్పుడూ లేని విధంగా పొన్నియిన్ సెల్వన్ 2 విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటున్నారన్నది అందరూ గమనిస్తున్న విషయం. ఇప్పటికే పొన్నియిన్ సెల్వన్ 2కి సంబంధించి పలు వీడియోలు రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా డ్రస్సింగ్ అప్ ఆదిత్య కరికాలన్ అనే వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో విక్రమ్ కేరక్టర్ ఆదిత్య కరికాళుడిగా మారిన విధానాన్ని పోట్రే చేశారు. భుజకీర్తులు, కవచ కుండలాలు, మేకప్ అంటూ ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిచయం చేయడానికి ప్రయత్నించారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో విక్రమ్‌కి ఏక లఖాని కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. విక్రమ్ గైక్వాడ్ హెయిర్ అండ్ మేకప్ చేశారు. కిషన్‌దాస్ అండ్ కో నుంచి జువెలరీ వచ్చింది. ఈ వివరాలన్నిటినీ వీడియోలో పొందుపరిచారు మేకర్స్. లైకా ప్రొడక్షన్ తో కలిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం.
ఆదిత్య కరికాళుడిగా ఓ వైపు యుద్ధవీరుడిగా ఉంటూనే, తన ప్రేయసిని మర్చిపోలేక సతమతమయ్యే వ్యక్తిగా నటించారు విక్రమ్. ఆయన సోదరిగా త్రిష, ప్రేయసిగా ఐశ్వర్యారాయ్, సామంత రాజుగా, స్నేహితుడిగా కార్తి, సోదరుడిగా జయం రవి స్క్రీన్ మీద కనిపిస్తారు. ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ పార్టుకి 500 కోట్లకు పైగా వసూళ్లొచ్చాయి. ఇప్పుడు సెకండ్ పార్టుని వెయ్యి కోట్ల మార్కుకు టార్గెట్ చేస్తున్నారు మేకర్స్. ఈ సారి ఆస్కార్ రేసులో పొన్నియిన్ సెల్వన్2 ని కూడా నిలపాలన్నది మేకర్స్ నిర్ణయం. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని కూడా ఆదిత్య కరికాళుడి వీడియోలో మెన్షన్ చేశారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
