సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది
on Jan 17, 2025
మంచు మోహన్ బాబు(MOhan Babu)ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొద్దీ రోజుల క్రితం నుంచి ఈ గొడవలు సద్దుమణిగినట్టుగా ఉన్నా కూడా రెండు రోజుల క్రితం మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మనోజ్ గొడవకి దిగడంతో మళ్ళీ వేడి రాజుకుందని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో విష్ణు(Manoj vishnu)సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ 'ఎక్స్' వేదికగా ఒక ట్వీట్ చెయ్యడం జరిగింది.తన తండ్రి మోహన్ బాబు నటించిన రౌడీ సినిమాలోని 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది.వీధిలో మొరగడానికి,అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మల్లో అయినా తెలుసుకుంటావనే ఆశ' అనే డైలాగ్ ని తన తండ్రి పిక్ తో సహా పోస్ట్ చేసాడు.ఈ డైలాగ్ తనకి చాలా ఇష్టమనే కామెంట్ ని కూడా విష్ణు యాడ్ చెయ్యడం జరిగింది.
ఇప్పుడు ఈ ట్వీట్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారగా మనోజ్(Manoj)రిప్లై ఎలా ఉండబోతుందో అనే క్యూరియారిటీ అందరిలో ఏర్పడింది.ఇప్పట్లో మంచు ఫ్యామిలీ గొడవ సద్దుమణిగే అవకాశం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.రీసెంట్ గా మనోజ్ మాట్లాడుతు గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఫ్యామిలీతో చర్చలు జరగాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
