బాలయ్యది మామూలు ప్లానింగ్ కాదు.. టచ్ కూడా చేయలేరు...
on Jan 17, 2025
సీనియర్ స్టార్స్ లో మరెవరికి సాధ్యంకాని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ, రీసెంట్ గా 'డాకు మహారాజ్'తో వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఇదే జోష్ లో మరో నాలుగో విజయాలను ఖాతాలో వేసుకునేలా అదిరిపోయే ప్లానింగ్ తో తెలివిగా అడుగులు వేస్తున్నాడు బాలయ్య. (Daaku Maharaaj)
బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ', గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి', అనిల్ రావిపూడితో 'భగవంత్ కేసరి', బాబీ కొల్లితో 'డాకు మహారాజ్' చేసి వరుస హిట్స్ అందుకున్నాడు బాలకృష్ణ. ఈ నలుగురు దర్శకులతో ఇదే ఆర్డర్ లో సినిమాలు చేసి మరో నాలుగో హిట్స్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే బోయపాటితో 'అఖండ-2' చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల కానుంది. 'అఖండ-2' తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నాడు బాలయ్య. ప్రస్తుతం 'జాట్' మూవీతో బిజీగా ఉన్న మలినేని, ఆ తర్వాత బాలయ్య ప్రాజెక్ట్ తో బిజీ అయ్యే అవకాశముంది. ఈ రెండు సినిమాల తర్వాత అనిల్ రావిపూడి, బాబీ కొల్లితో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఈలోపు చిరంజీవితో రావిపూడి ఒక సినిమా చేయనున్నాడు. బాబీ కూడా ఒకట్రెండు సినిమాలు ఇతర హీరోలతో చేసి, మళ్ళీ బాలయ్య దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే బాలకృష్ణకు ఇది క్రేజీ లైనప్ అవుతుంది. మరి ఈ నలుగురు దర్శకులు, బాలయ్యకు వరుసగా మరో నాలుగు విజయాలను అందిస్తారేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
