శ్రుతిహాసన్ కు ఎక్కడ ఆపాలో తెలుసట..!
on May 20, 2016
శ్రుతిహాసన్ కు ఈ మధ్య హాట్ నెస్ ఎక్కువైపోయిందనేది అందరూ అంటున్నమాట. అందుకు కారణం లేకపోలేదు. ఒక మ్యాగజీన్ కు ఈ భామ ఇచ్చిన ఫోజులు కుర్రకారు మతిపోగొట్టేలా ఉన్నాయి. బికినీలు, క్లీవేజ్ షో లతో రెచ్చిపోయింది. ప్రస్తుతం శృతి అందరూ ఈ ఫోటో షూట్ గురించే అడుగుతున్నారట. ఎందుకమ్మడూ ఇంత రెచ్చిపోతున్నావ్..ఏంటి సంగతి అని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారట. దీంతో పాప ఇక ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ కు ఆన్సర్ ఇచ్చేసింది. నేను హాట్ గా ఉంటాను కాబట్టి సెక్సీగా కనిపిస్తుంటాను. అంతేకాదు ఎవరైనా నన్ను హాట్ గా ఉన్నావంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అని సెలవిస్తోంది. హాట్ అనేది కేవలం శారీరక అందమే కాదు. మానసిక థైర్యం, కాన్ఫిడెన్స్ లాంటివన్నీ కలిసే సెక్సీగా చూపిస్తాయి. అంతేకాదు నాకు ఎక్కడ ఆపాలో, లిమిట్స్ ఎక్కడ దాటకూడదో తెలుసు. ప్రేక్షకుల మనసుల్లో ఒక యాక్ట్రెస్ గా నిలిచిపోవడానికే నేను ప్రాముఖ్యతనిస్తాను అంటూ చాలా పేద్ద జవాబిచ్చింది హాసన్ గారమ్మాయి.