వింటేజ్ మెగాస్టార్.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు!
on Aug 22, 2025

మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రకటనతోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వరుస బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్స్ ని అందిస్తున్న అనిల్ రావిపూడి.. మెగాస్టార్ తో మొదటిసారి చేతులు కలపడంతో.. కేవలం అభిమానుల్లో మాత్రమే కాకుండా అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. (Mega 157 Title Glimpse)
నేడు(ఆగస్టు 22) చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'మెగా 157' టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ చిత్రానికి 'మన శంకరవరప్రసాద్ గారు' అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. 'పండగకి వస్తున్నారు' అనే ట్యాగ్ లైన్ ని కూడా జోడించారు. (Mana Shankara Varaprasad Garu)

దాదాపు నిమిషం నిడివితో రూపొందించిన 'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది. వింటేజ్ చిరంజీవిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. సిగరెట్ వెలిగించి, నల్ల కళ్లద్దాలు పెట్టుకొని, కార్ దిగి సూట్ లో మెగాస్టార్ నడిచి రావడం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. 'బాస్' అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రావడం, "మన శంకరవరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు" అని వెంకటేష్ వాయిస్ తో చెప్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక గ్లింప్స్ చివరిలో గన్ పట్టుకొని చిరంజీవి మెట్లు దిగే షాట్, గుర్రాన్ని పట్టుకొని చిరు నడిచే షాట్ వేరే లెవెల్ లో ఉన్నాయి.
మొత్తానికి 'మన శంకరవరప్రసాద్ గారు'తో అభిమానులకు అసలుసిసలైన మెగా ట్రీట్ ఇవ్వబోతున్నట్లు గ్లింప్స్ తోనే క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ కూడా ఓ స్పెషల్ రోల్ లో కనువిందు చేయనుండటం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



