మన శంకర వరప్రసాద్ గారు 50 రోజులు సాధ్యమేనా! ఆ హీరో ఫ్యాన్స్ ఏమంటున్నారు
on Jan 30, 2026

-తగ్గేదెలే అంటున్న మన శంకర వరప్రసాద్ గారు
-50 డేస్ సెంటర్స్ ఎన్ని
-అసలు 50 డేస్ ఆడుతుందా
-ఫ్యాన్స్ ఎన్ని సెంటర్స్ చెప్తున్నారు
సెల్యులాయిడ్ వద్ద 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana shankara Varaprasad Garu)జోరు యదా రాజా, తదా ప్రజా అనే రీతిలో యదా మన శంకర వరప్రసాద్ గారు, తదా ప్రేక్షకులు లాగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 350 కోట్ల రూపాయల గ్రాస్ కి పైనే సాధించి సరికొత్త రికార్డులని సృష్టించబోతున్నానని బాక్స్ ఆఫీస్ సాక్షిగా చెప్తున్నాడు. అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్ లు లాభాల బాట పడుతుండటంతో పాటు థియేటర్ ల ఆక్యుపెన్సీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాకి అందని ద్రాక్షగా మారిన 50 రోజులని శంకర వర ప్రసాద్ ఎన్ని థియేటర్స్ లో జరుపుకుంటుందనే ఆసక్తి అందరిలో ఉంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తు మన శంకర వర ప్రసాద్ మూడో వారంలోకి దగ్గర అవుతున్నాఇంకా చాలా థియేటర్స్ లో కలెక్షన్స్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫ్యామిలీ సినిమా కావడం ప్లస్ పాయింట్. దీంతో ఆ కేటగిరి ఆడియన్స్ రాక మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు డెబ్భై థియేటర్స్ లో అయినా అర్ధశతదినోత్సవం జరుపుకునే అవకాశం ఉంది.ఈ సంక్రాంతికి రాజాసాబ్,నారి నారి నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు వచ్చాయి. ఈ సినిమాలు భారీ సంఖ్యలోనే థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. కాబట్టి మన శంకర వరప్రసాద్ కి హిట్ టాక్ రాగానే థియేటర్స్ కి వెళ్లి చూడటానికి ఎక్కువ థియేటర్స్ లేవు. ఎక్కువ థియేటర్స్ ఉండి ఉంటే చాలా మంది ప్రేక్షకులు త్వరగా మూవీని చూసే వారు.కాబట్టి ఈ సారి యాభై రోజులు జరుపుకోవడం ఖాయమని అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also read: గాంధీ టాక్స్ మూవీ రివ్యూ
ఇక మన శంకర వర ప్రసాద్ ఏ ముహూర్తాన కుదిరిందో గాని తెలుగు సినిమా తన తెలుగు కథల వైభవం ఇంకా బతికే ఉందని మురిసిపోతుంది. అచ్చ తెలుగు సినిమా ప్రేక్షకుడు కూడా అంతే ఆనందంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యాభై రోజుల వరకు తీసుకెళ్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



