మెగాస్టార్ నెక్ట్స్ మూవీలో హీరోయిన్‌గా హిజ్రా
on Jan 18, 2017

టైటిల్ చూసి ఏదేదో ఊహించుకోకండి..మెగాస్టార్ అంటే మన మెగాస్టార్ చిరంజీవి కాదు..మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ఇంతవరకు ఏ స్టార్‌హీరో చేయని సాహసం ఆయన చేస్తున్నారు. తన తర్వాతి సినిమా "పెర్నాబు"లో అందాల ముద్దుగుమ్మలను కాదని ఫస్ట్ టైం ఒక హిజ్రాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు మమ్ముట్టి. 19 ఏళ్ల వయసులో ట్రాన్స్‌జెండర్‌గా మారి..మోడల్‌గా కొనసాగుతున్న అంజలి అమీర్‌కి మెగాస్టార్ పక్కన నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. తనని ఎంపిక చేసిన చిత్ర యూనిట్‌కి అంజలి థాంక్స్ చెప్పింది..ముఖ్యంగా మమ్ముట్టి సార్ సపోర్ట్ ఎన్నటికి మరువలేనని తెలిపింది. ఈ విషయం బయటకు తెలిసిన వెంటనే మల్లువుడ్‌తో పాటు ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



