మమ్ముట్టి ఆరోగ్యంపై ఎంపీ జాన్ బ్రిట్టాస్ కీలక ప్రకటన
on Jun 19, 2025
మలయాళ సూపర్ స్టార్ 'మమ్ముట్టి'(Mammotty)తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడనే వార్త, గత కొన్ని రోజుల క్రితం ప్రముఖంగా వినపడింది. దీంతో అభిమానులతో పాటు ప్రేక్షక లోకం ఆందోళనకి లోనవ్వడంతో, మమ్ముట్టి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. రంజాన్ సందర్భంగా షూటింగ్ నుంచి బ్రేక్ అప్ తీసుకొని వెకేషన్ కి వెళ్లారనే ప్రకటనని మమ్ముట్టి టీం చేసింది.
రీసెంట్ గా మళ్ళీ మమ్ముట్టి ఆరోగ్యం బాగాలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మమ్ముట్టి స్నేహితుడు రాజ్యసభ ఎంపి జాన్ బ్రిట్టాస్(John Brittas)మాట్లాడుతు మమ్ముట్టి నేను చాలా కాలం నుంచి మంచి స్నేహితులం. కానీ ఏ రోజు కూడా ఒకరి వ్యక్తిగత విషయాల గురించి ఇంకొకరం మాట్లాడుకోకపోయినా, కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. మమ్ముట్టి స్వల్ప అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడే ఆయనతో ఫోన్ లో మాట్లాడానని జాన్ చెప్పుకొచ్చాడు.
1971 లో సినీ రంగ ప్రవేశం చేసిన మమ్ముట్టి ఇప్పటి వరకు మళయాళంతో పాటు ఇతర భాషల్లో కలిపి సుమారు నాలుగు వందల ఇరవై ఐదు సినిమాల వరకు చేసాడు. వాటిల్లో ఎక్కువ భాగం విజయం సాధించాయి. గత సంవత్సరం బ్రహ్మయుగం, టర్బో, డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ వంటి చిత్రాలతో మెప్పించిన మమ్ముట్టి మొన్న ఏప్రిల్ లో 'బజూకా' అనే మూవీతో వచ్చాడు. 'కలం కావల్' అనే కొత్త చిత్రం ఆగస్టు 1 న విడుదల కానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
