పవర్ స్టార్ సరసన మాళవిక మోహన్!
on Mar 21, 2023
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా మాళవిక మోహన్ నటించనుందని సమాచారం.
మలయాళీ నటి మాళవిక మోహన్ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా అధికారిక ప్రకటన రానప్పటికీ షూటింగ్ మాత్రం జరుపుకుంటోంది. తెలుగులో మొదటి సినిమాకే ప్రభాస్ సరసన నటించే అవకాశం దక్కించుకున్న మాళవిక.. ఇప్పుడు మరో స్టార్ హీరో పవన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో మొదట హీరోయిన్ గా పూజ హెగ్డే పేరు ఖరారైంది. ఆ తరువాత శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరిలో ఒకరు మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశముండగా.. సెకండ్ హీరోయిన్ గా మాళవిక పేరు ఖరారైనట్లు న్యూస్ వినిపిస్తోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
